ముందు వీళ్ల మీద చర్యతీసుకోండి. తర్వాత హరీశ్‌రావు మీద తీసుకోండి
(తెలంగాణ శ్రీనివాస్)
(తెలంగాణ శ్రీనివాస్)
ఎపీ భవన్ అధికారులపై దాడులు జరగడం ఇదేం కొత్త కాదు.. సీమాంధ్ర, తెలంగాణద్రోహులు ఏపీ భవన్ అధికారులను ఇదివరకు పిచ్చకొట్టుడు కొట్టిన్రు. అప్పుడు ఏ దళిత నేత కేసు పెట్టలేదు. చర్యతీసుకోవాలని అరవలేదు. అమరుడిని అవమానించిన చందర్‌రావును కొడితే కేసులు పెట్టేలని సీమాంధ్ర మీడియా. సీమాంధ్ర నేతలు బట్టలు చింపుకుంటున్నరు. ఎప్పుడు ఎవరు ఎవరిని కొట్టిన్రో చూడండి.
1)1986లో బీసీ వర్గానికి చెందిన ఆనంద రాఘవన్ అనే బీసీ అధికారిపై ఎంపీ కావూరి సాంబశివరావు చేయిచేసుకున్నడు.
2)1986లోనే అదే ఆనందరాఘవపై వైఎస్ రాజశేఖర్ రెడ్డి దాడి చేసి చెంప పగలగొట్టిండు.
3)1987లో ఎంపీ కే.యం.ఖాన్ నాగేశ్వరావ్ అనే ఎంప్లాయిపై చెయి చేసుకున్నడు.
4)1988లో అదే నాగేశ్వర్‌రావుపై కాంగ్రెస్ నేత మహ్మద్ జానీ దాడి చేసిండు.
5)1991లో బాలరాజ్ అనే కాంగ్రెస్ నాయకుడు మల్లిఖార్జున్‌పై చెయ్యి చేసుకున్నడు.
6)1996లో గఫర్ అనే అధికారిపై దానం నాగేందర్ రెచ్చిపొయి చితకబాదిండు.
7)దానం దాడికి నిరసనగా ఏపీ భవన్ ఉద్యోగుల ఆందోళన చేస్తే.. ప్రభుత్వం వారిపై ఎస్మా ప్రయోగించింది.
8)2010లో ఎస్టీ వర్గానికి చెందిన అసిస్టెంట్ కమిషనర్ లింగరాజును ఢిల్లీ ఎయిర్ పోర్టులో మహ్మద్ జానీ చెప్పుతో కొట్టిండు.
వీళ్లు మనుషులు కాదా? వీళ్ల మీద చర్యతీసుకోరా, వీళ్లపై చర్య తీసుకున్నంకనే మావోళ్ల మీద చర్యతీసుకోవాలి. అయినా కొట్టింది హరీశ్ అయితే వినోద్, కేటీఆర్‌లపై ఎందుకు కేసుపెట్టించిన్రు. ఈ కేసుల కుట్రలో సీమాంధ్ర నేతలతో పాటు సీమాంధ్రమీడియా హస్తం కూడా ఉంది.
0 comments:
Post a Comment