Thursday, 4 August 2011

అమెరికా బడ్జెట్‌ సంక్షోభానికి అసలు కారణం

అమెరికాలో సంపన్నులు నేడు గత యాభైఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ పన్ను చెల్లిస్తున్నారు. ఈ మాట ఎవరో కాదు, ఒబామాయే స్వయంగా సెలవిచ్చాడు. 2001లో, 2003లో, 2005లో బుష్‌ పన్నులను తగ్గిస్తూ వచ్చాడు. దాన్ని నిర్లజ్జగా ఒబామా కూడ కొనసాగించాడు. 2001 నుండి ఈ పన్ను తగ్గింపుల వల్ల ఖజానాకు 2 లక్షల కోట్ల డాలర్ల రాబడి తగ్గిపోయింది. 9/11 తర్వాత అమెరికా ఆఫ్ఘనిస్తాన్‌పై, ఇరాక్‌పై చేపట్టిన యుద్ధాల ఖర్చు 1.3 లక్షల కోట్ల డాలర్లు. గత పదేళ్ల కాలంలో అమెరికా రక్షణ బడ్జెట్‌ 67 శాతం పెరిగింది. రీగన్‌, బుష్‌లు సంపన్నులను 'ఉద్యోగాల సృష్టికర్తలు' అని పేర్కొంటూ అనేక రాయితీలు కుమ్మరించారు. అదే బాటలో ఒబామా కూడ పయనించాడు.
అమెరికా పాలక, ప్రతిపక్షాలకు మధ్య ఒప్పందం కుదిరి, బడ్జెట్‌ లోటుపై ఏర్పడిన వివాదం సమసిపోవడంతో పెద్ద గండం తప్పిపోయినట్లు ప్రధాన స్రవంతి మీడియా ప్రచారం చేసింది. ఒక ప్రభుత్వం ఖజానా నిండుకున్నపుడు కొత్త రుణబాండ్లను విడుదల చేసి సొమ్ము సమకూర్చుకొని చెల్లింపులు జరపడం అనేది అతి సాధారణమైన ప్రక్రియ. కాని అమెరికాలో ఈ అంశం పాలక ప్రతిపక్షాల మధ్య తీవ్రమైన వివాదంగా తయారయి, ప్రభుత్వం రుణపరిమితిని పెంచడానికి ససేమిరా అంటూ ప్రతిపక్షం అడ్డుపడింది. పార్లమెంటు ఉభయసభల్లో ఒక సభలో మెజారిటీ కలిగిన ప్రతిపక్ష రిపబ్లికన్‌ పార్టీ, కొత్తగా రంగప్రవేశం చేసిన టీపార్టీలు ఈ వ్యవహారంలో ముందున్నాయి. అధ్యక్షుడు ఒబామా బడ్జెట్‌ వ్యయంలో కోత విధిస్తే తప్ప రుణపరిమితిని పెంచడానికి అంగీకరించబోమని భీష్మించుకున్నాయి. చివరకు ఒబామా వారి వత్తిడికి తలొగ్గాడు. రాబోయే పదేళ్లలో బడ్జెట్‌ వ్యయంలో 2.5 లక్షల కోట్ల డాలర్లు కోతపెట్టడానికి అంగీకరించాడు. దానితో అప్పటివరకు అధోదిశగా ఉన్న స్టాక్‌మార్కెట్లు పుంజుకున్నాయి.
ఈ ఉదంతంలో తప్పనిసరిగా గుర్తించాల్సిన ఒక అంశం ఉంది. అధ్యక్షునికి, ప్రతిపక్షాలకు మధ్య జరుగుతున్న నాటకీయ సంప్రదింపులు, పర్యవసానాలు లాంటి అంశాలపై మీడియా కేంద్రీకరించింది తప్ప అసలు ఈ సంక్షోభానికి మూలం ఏమిటి, దాన్ని వెల్లడించి, నిర్మూలించాలని చెప్పడానికి కాని, ఆ తర్వాత జరిగిన ఒప్పందం వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ప్రత్యేకించి సాధారణ ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అన్న అంశాలను వివరించడానికి కానీ ప్రయత్నించలేదు. నిజానికి ఈ ఒప్పందం ప్రముఖ కాలమిస్టు జార్జి మోనోబైట్‌ పేర్కొన్నట్లు 'అమెరికా సంపన్నులు, సామాన్య ప్రజలపై జరిపిన కుట్ర'. అసలు ఈ పరిస్థితి రావడానికి మూలకారణం, అది రిపబ్లికన్‌ పార్టీయా, డెమొక్రటిక్‌ పార్టీయా అన్నదానితో నిమిత్తం లేకుండా వరుసగా ప్రభుత్వాలు సంపన్నులకు అనుకూలంగానే కాదు, అనేక రాయితీలు, మినహాయింపులు కల్పించే విధానాలను అనుసరించడమే.

అమెరికాలో సంపన్నులు నేడు గత యాభైఏళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ పన్ను చెల్లిస్తున్నారు. ఈ మాట ఎవరో కాదు, ఒబామాయే స్వయంగా సెలవిచ్చాడు. 2001లో, 2003లో, 2005లో బుష్‌ పన్నులను తగ్గిస్తూ వచ్చాడు. దాన్ని నిర్లజ్జగా ఒబామా కూడ కొనసాగించాడు. 2001 నుండి ఈ పన్ను తగ్గింపుల వల్ల ఖజానాకు 2 లక్షల కోట్ల డాలర్ల రాబడి తగ్గిపోయింది. 9/11 తర్వాత అమెరికా ఆఫ్ఘనిస్తాన్‌పై, ఇరాక్‌పై చేపట్టిన యుద్ధాల ఖర్చు 1.3 లక్షల కోట్ల డాలర్లు. గత పదేళ్ల కాలంలో అమెరికా రక్షణ బడ్జెట్‌ 67 శాతం పెరిగింది. రీగన్‌, బుష్‌లు సంపన్నులను 'ఉద్యోగాల సృష్టికర్తలు' అని పేర్కొంటూ అనేక రాయితీలు కుమ్మరించారు. అదే బాటలో ఒబామా కూడ పయనించాడు. వీటివల్ల దేశంలో సంపద కేంద్రీకరణ మరింత తీవ్రమయింది. నోబెల్‌ ఆర్ధికవేత్త జోసఫ్‌ స్టిగ్లిజ్‌ చెప్పినట్లు ఈ పదేళ్ల కాలంలో పైతరగతికి చెందిన ఒక శాతం మంది సంపద 18 శాతం పెరగగా, పారిశ్రామిక కార్మికుల వేతనాలు 12 శాతం తగ్గిపోయాయి. ఇది చాలదన్నట్లు, బడ్జెట్‌ రుణపరిమితిని పెంచడానికి ఒబామా అభ్యర్థ్ధనలపై ఇటీవల స్పందిస్తూ అమెరికా ప్రతినిధుల సభ బడ్జెట్‌ కమిటీ అధ్యక్షుడు పాల్‌ ర్యాన్‌ ప్రస్తుతం అమెరికా బడ్జెట్‌ వ్యయం జిడిపిలో 24 శాతం ఉందని, దాన్ని 2050 నాటికల్లా 14.75 శాతానికి తగ్గేలా చేయాలని, గరిష్ట పన్ను రేట్లను ప్రస్తుతమున్న 35 శాతం నుండి, 25 శాతానికి తగ్గేలా చూడాలని కోరారు.

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాలసీ అనే సంస్థ మరిన్ని ఆసక్తికరమైన వాస్తవాలను వెల్లడించింది. ఆ సంస్థ అధ్యయనం ప్రకారం- ఏడాదికి పది లక్షల డాలర్లు అంతకు మించి ఆదాయం లభిస్తున్న వారు, 1961 పన్నురేట్ల ప్రకారం నేడు కూడ చెల్లిస్తే అమెరికా ప్రభుత్వ ఖజానాకు ఏడాదికి 71,600 కోట్ల డాలర్లు అదనంగా చేరతాయి. ఇలా చేస్తే అమెరికా ప్రభుత్వం ఇన్వెస్టర్లకు చెల్లించాల్సిన రుణం పదేళ్లలో తీరిపోతుంది.
అతి సంపన్నుల ఆదాయాలను లెక్కించడంలో నిష్ణాతులైన డైమండ్‌, సాయెజ్‌ అనే ఇద్దరు ఆర్థికవేత్తలు వేసిన అంచనాల ప్రకారం, అమెరికాలో ఉన్నత తరగతికి చెందిన ఒక శాతం సంపన్నులు ప్రస్తుతం చెల్లిస్తున్న 22.4 శాతం పన్ను రేటును రెట్టింపుచేసినా మొత్తం జిడిపిలో వారి ఆదాయ వాటా 1970లో వారి ఆదాయ వాటాకన్నా రెట్టింపు ఉంటుంది. అమెరికాలో 400 మంది అతి సంపన్నుల ఆదాయం గత యాభై ఏళ్ల కాలంలో ద్రవ్యోల్బణాన్ని కూడ పరిగణనలోకి తీసుకున్న తర్వాతసైతం స్థిరంగా 20 రెట్లు పెరిగిందని వీరే తెలిపారు.

ఇలా ఆదాయం పెరిగిన సంపన్నులపై అదనపు పన్నులు విధించడానికి ప్రభుత్వం సిద్ధపడకపోగా, పేదలు, సామాన్యులకు అందించే ఉపశమనాలకు కోతపెట్టి అదనపు భారాలు మోపడానికి పూనుకుంటున్నది. తాజాగా కుదిరిన ఒప్పందంలో వివరాలు వెల్లడి కానప్పటికీ ఇటీవల కాలంలో సామాజిక సంక్షేమానికి కోత ఎంత పెట్టాలన్న దానిపై పాలక పార్టీలకు చెందినవారి ప్రతిపాదనలు ఈ అంశాన్ని స్పష్టంగా సూచిస్తున్నాయి. బెర్ని శాండర్స్‌ అనే సెనెటర్‌కు సామాజిక సంక్షేమ శాఖ అందించిన అంచనాల ప్రకారం- 2030 నాటికల్లా 1.73 లక్షల మంది అదనంగా పేదల జాబితాలోకి చేరతారు. నెలవారీ వితంతు పెన్షన్లు 48 డాలర్లకు కుదించబడతాయి. 70-79 సంవత్సరాల వృద్ధులు నెలకు అందుకునే మొత్తం 49 డాలర్లు తగ్గుతుంది. బడ్జెట్‌లో ప్రభుత్వం విచక్షణాపూర్వకంగా పెట్టే వ్యయాన్ని తగ్గించడం ద్వారా రాబోయే పదేళ్లలో 90 వేల నుండి లక్ష కోట్ల డాలర్లు ఆదా అవుతుందని ప్రస్తుత ఒప్పందంలో పేర్కొన్నది ఇలాంటి సామాజిక సంక్షేమ వ్యయాన్ని కోత పెట్టడం ద్వారానే అని గ్రహించాలి.

అమెరికా 1930ల నాటి తర్వాత అతి పెద్ద ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నదని చెపుతున్నప్పటికీ, దాని ఫలితాలు మాత్రం అప్పటికన్నా సుదీర్ఘకాలం కొనసాగుతున్నాయి. ఆర్ధిక వ్యవస్థ పుంజుకోవడం మొదలయిందని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ నిరుద్యోగం అంతకంతకు పెరుగుతున్నది తప్ప తగ్గడం లేదు. ఆర్ధిక వ్యవస్థ మెరుగుపడుతున్నదని చెప్పిన్పటికీ దాని వేగం మాత్రం మందగొడిగానే ఉంది. 1930లలో సైతం ఇంత సుదీర్ఘకాలం ఆర్ధిక వ్యవస్థ మందగొడిగా లేదు. బెయిలవుట్‌ పేరుతో ప్రభుత్వం వేలకోట్ల డాలర్లు సంపన్నులకు కట్టబెట్టినప్పటికీ అవి ఉపాధిని పెంచడానికి దోహదపడలేదు. ఇదే సమయంలో ప్రభుత్వరంగం కూడ ఉద్యోగాలకు కోత పెడుతున్నది. గత జూన్‌ లెక్కల ప్రకారం ప్రైవేటు రంగం నుండి 4.46 లక్షల ఉద్యోగాలు తగ్గిపోగా, అమెరికా ఫెడరల్‌ ప్రభుత్వం 2.66 లక్షల ఉద్యోగాలను, స్ధానిక ప్రభుత్వాలు 2.03 లక్షల ఉద్యోగాలను తగ్గించాయి.

బడ్జెట్‌ లోటును తగ్గించుకోవాలని ఇప్పుడు కోరుతున్న వారెవరూ పేద ప్రజల గురించి కాని, ఉద్యోగులు, కార్మికుల గురించి కాని ఎంత మాత్రం ఆలోచించడం లేదు. ఈ వ్యవహారంలో ప్రముఖంగా ముందుకొచ్చిన టీపార్టీ గురించి ప్రధాన స్రవంతి మీడియాలో అదేదో అతివాద పార్టీ అన్న ధోరణిలో ప్రచారం సాగుతున్నది. ఆ పార్టీ ఆవిర్భావమే సాధారణ ప్రజలకు వ్యతిరేకంగా జరిగింది. గృహరుణ సంక్షోభ బాధితులకు సబ్సిడీలు అందిస్తానన్న ఒబామా ప్రకటనకు నిరసనగా మిచిగన్‌ నగరంలోని ట్రేడర్లు తమ వద్దఉన్న సెక్యూరిటీలను మిచిగన్‌ సరస్సులో పారవేసేందుకు ఒక టీపార్టీకి హాజరు కావాలని 'సౌభాగ్యం కోసం అమెరికన్లు' అనే పేరుతో సిఎన్‌బిసిలో ఒక ఆహ్వానం ప్రసారం కావడంతో ఈ 'టీపార్టీ' మొదలయింది. చమురు, గ్యాస్‌, ఖనిజాలు, కలప, రసాయనాలు తదితర రంగాలలో 4,300 కోట్ల డాలర్ల విలువైన కంపెనీలకు ప్రాతినిధ్యం వహించే చార్లెస్‌, కోష్‌ అనే ఇద్దరు సంపన్నులు ఈ 'సౌభాగ్యం కోసం అమెరికన్లు' అనే సంస్థను నెలకొల్పారు. వీరి పని సంపన్నులపై పన్నులను తగ్గించేలా, పరిశ్రమలపై నియంత్రణలను సడలించేలా అధికారవర్గాలలో లాబీయింగ్‌ చేయడమే. లాబీయింగ్‌ కోసం వీరు గత పదిహేనేళ్లలో 8.5 కోట్ల డాలర్లు ఖర్చుపెట్టారు. కార్బన్‌ ఉద్గారాలను తగ్గించే సుంకాలను తగ్గించేలా చేయడం, ఆరోగ్య సంరక్షణా రంగ సంస్కరణలను అడ్డుకోవడం వీరి లాబీయింగ్‌లో భాగంగా ఉన్నాయి. 2010 ఎన్నికల్లో తనకు అభిమాన పాత్రులైన అభ్యర్థులకు ఈ సంస్థ 4.5 కోట్ల డాలర్లు విరాళంగా అందించింది.

ఇలాంటి శక్తుల వత్తిళ్లకు తలొగ్గిన అధ్యక్షుడు ఒబామా బడ్జెట్‌ వ్యయంపై తీవ్రమైన కోతలకు అంగీకరించాడు. సంపన్నులపై పన్నులు పెంచేందుకు కాని, రాయితీలను కొంతైనా తగ్గించుకోవడానికి కాని ఎంతమాత్రం సిద్ధపడకుండా పేద, సాధారణ ప్రజానీకం స్థితిగతులను మరింత దిగజార్చే చర్యలకు పూనుకున్నాడు. ఎంతో ఆర్భాటంగా ప్రచారం జరిగిన, ప్రజలు ఎంతగానో ఆశపడిన ఆరోగ్య సంరక్షణ పథకం ఈ కోతలతో ప్రమాదంలో పడేలా ఉంది, ఒక వేళ ఉన్నా నామమాత్రంగా మారిపోతుంది. ప్రతిపక్షంతో కుదుర్చుకున్న ఈ ఒప్పందం ద్వారా ఒబామా మరోసారి తాను ఎవరి పక్షం అన్న విషయాన్ని స్పష్టంగా నిరూపించుకున్నాడు.

విప్ గిప్ జాన్త నహీ

అధిష్టా నం  ఆదేశాలను భే ఖాతరు చేసిన టి-ఎంపి లు
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు పార్టీ అధిష్టానం విప్‌ను ధిక్కరించి ఓటింగుకు గైర్హాజరయ్యారు. పార్లమెంటులో లోక్ పాల్, ధరల పెరుగుదలపై గురువారం ఓటింగు జరిగింది. దీనికి హాజరు కావాలని తెలంగాణ కాంగ్రెసు ఎంపీలకు పార్టీ అధిష్టానం విప్ జారీ చేసింది. విప్ ధిక్కరించి వారు ఓటింగుకు గైర్హాజరయ్యారు. ఎంపీ సురేష్ షేట్కార్ మినహా ఎవరూ సభకు హాజరు కాలేదు. ఆయన ధరల పెరుగుదలపై ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. కాగా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు ఇంట్లో టి-కాంగ్రెసు ఎంపీలు సమావేశమయ్యారు.

అనంతరం గుత్తా సుఖేందర్ రెడ్డి, మధుయాష్కీ మాట్లాడారు. రాజీనామాలపై తాము రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పారు. శనివారం రోజు హైదరాబాదులో కాంగ్రెసు స్టీరింగ్ కమిటీ సమావేశం అయి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ కోసం ప్రజా సంఘాలు చేస్తున్న ఆందోళనలకు మద్దతు ఇస్తామని చెప్పారు. అయితే ఉద్యోగ సంఘాలు చేస్తున్న దీక్షకు తాము మద్దతు ప్రకటించేది లేనిది స్టీరింగ్ కమిటీలో నిర్ణయిస్తామని చెప్పారు.

ఓటింగు అనంతరం షేట్కారు విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వానికి ఇబ్బందులు కలగకూడదనే ఓటింగులో పాల్గొన్నట్టు చెప్పారు. ధరల పెరుగుదల విషయంలో ఓటింగులో పాల్గొన్నట్లు చెప్పారు. అయితే తెలంగాణ కోసం ఉద్యమం కొనసాగుతుందన్నారు. ఓటింగుకు తెలంగాణ ప్రజాప్రతినిధులు అందరూ రావాలని అనుకున్నప్పటికీ ఓటింగ్ ముందుగా జరగడం వల్ల వారు రాలేక పోయారని చెప్పారు. ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నది సమావేశాలు బహిష్కరించడానికి కాదన్నారు. కాగా లోక్ పాల్ బిల్లును మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ప్రవేశ పెట్టారు. అయితే ప్రధాని, న్యాయవ్యవస్థను లోక్ పాల్ పరిధిలోకి తీసుకు రాకపోవడంపై విపక్షాలు ప్రశ్నించాయి.