Friday, 29 July 2011

Ponnam prabhakar, mp karimnagar

కాంగ్రెస్ నాయకుడికంటే తెలంగాణవాదిగానే ఆయన ముద్రపడ్డారు! ఇదీ పొన్నం ప్రభాకర్‌ను ఉద్దేశించి ఓ ప్రధానోపాధ్యాయుడు చేసిన వాఖ్య! తెలంగాణ ఉద్యమంలో పొన్నం ప్రభాకర్ క్రియాశీలత ఎంత? అన్న ప్రశ్నకు సమాధానంగా నిలిచే వ్యాఖ్య ఇది! చిన్న వయసులోనే అత్యున్నత చట్టసభ అయిన లోక్‌సభకు ఎన్నికయ్యారు పొన్నం ప్రభాకర్. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో అత్యంత పిన్న వయస్కుడైన ఎంపీగా నిలిచారు. కరీంనగర్ నుంచి లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న పొన్నం ప్రభాకర్.. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూనే తెలంగాణవాదాన్ని గట్టిగా వినిపిస్తున్నారు. విద్యార్థి ఉద్యమాల నుంచి ఎదిగిన పొన్నం.. ఇప్పుడు తెలంగాణ ఉద్యమకారుడిగా పోరుబాటలో సాగుతున్నారు. ఉద్యమం కోసం పార్టీ ఎంపీల ఫోరం కన్వీనర్ పదవినేగాక.. ఎంపీ పదవిని సైతం త్యజించారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు సాగిస్తున్న ఉద్యమంలో దూసుకు పోతున్న యువనేత ఆయన. పదవులను సైతం లెక్క చేయకుండా ప్రజల ఆకాంక్షలు, కోరికల మేరకు ఉద్యమబాట పట్టిన ఆ యువనేత ప్రజావూపతినిధిగా కూడా ప్రజల మన్ననలు పొంది తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. తొలిసారి ఎంపీగా గెలిచి ఏకంగా అధికార పార్టీ రాష్ట్ర ఎంపీల ఫోరం కన్వీనర్ బాధ్యతలు చేపట్టి ప్రతిభను చాటుకున్నారు. సీమాంధ్ర నేత లగడపాటి రాజగోపాల్ సవాలుకు జవాబుగా తెలంగాణ రాష్ట్రమే ముఖ్యంతప్ప పదవి కాదంటూ క్షణంలో ఆ పదవి వదులుకున్నారు. 158 రోజులు లోక్‌సభ నడిస్తే 155 రోజులు హాజరై రాష్ట్ర నేతల తరఫున రికార్డు సృష్టించారు. లోక్‌సభలో తన నియోజకవర్గం, రాష్ట్రానికి సంబంధించి 522 ప్రశ్నలు వేసి అత్యధికంగా ప్రశ్నలు వేసిన ఎంపీల్లో ఆంధ్రవూపదేశ్ నుంచి రెండవ, జాతీయ స్థాయిలో తొమ్మిదవ స్థానంలో నిలిచారు. నియోజకవర్గం ప్రజలకు ఎక్కువ కాలం అందుబాటులో ఉంటూ వారి అవసరాలు తీర్చే ప్రయత్నం చేశారు. రాష్ట్ర మార్క్‌ఫెడ్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత రూ. 250 కోట్లు ఉన్న ఆ సంస్థ టర్నోవర్‌ను రూ. 1400 కోట్లకు తీసుకెళ్ళి తన సత్తా చాటుకున్నారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ అన్ని విశ్వవిద్యాలయాలు తిరిగి సంస్థ బలోపేతానికి ఎనలేని కృషి చేశారు. ఆ పనితీరు గమనించే ఏమో కాంగ్రెస్ పార్టీ ఆయనకు మార్క్‌ఫెడ్ ఛైర్మన్ పదవిని కట్టబెట్టింది. ఆ తరువాత ఎంపీ టికెటిచ్చింది. 1987లో కరీంనగర్ ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కాలేజ్ విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆ తరువాత ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1999-2002 మధ్య ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా, 2005లో ఏపీ మార్క్‌ఫెడ్ ఛైర్మన్‌గా పనిచేసి 2009లో తొలిసారిగా కరీంనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తరువాత రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల ఫోరం కన్వీనర్‌గా పనిచేశారు. ఆయనే పొన్నం ప్రభాకర్. ప్రస్తుతం తెలంగాణ ఉద్యమబాట పట్టి టీ కాంగ్రెస్ ప్రజావూపతినిధుల స్టీరింగ్ కమిటీకి కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నరు.

Thursday, 28 July 2011

ఢిల్లీలో ప్రాణత్యాగం చేసిన ఆదిరెడ్డి సూసైడ్‌ నోట్‌



హైదరాబాద్‌ల ట్రైన్‌ ఎక్కేముందు ఎన్నోసార్లు ఆలోచించిన. 17-7-2011 వరకు ఎలాంటి ప్రకటన రాకుంటే..ఢిల్లీ వెళ్లి ప్రాణత్యాగం చేయాలని అనుకున్న. నేను ఇప్పుడు ఢిల్లీలో ఉన్న. ఎందుకో నా మనసు చాలా ప్రశాంతంగా ఉంది. అమ్మతో మాట్లాడిన. చెల్లెతో మాట్లాడిన. ఇక్కడికి వచ్చేముందు అమ్మను చూసి. అమ్మ చేతివంట కడుపునిండా తిని..అమ్మ ఆశీర్వాదం తీసుకుని వద్దామనుకున్న. కానీ, నా లక్ష్యం కోసం ఎక్కడ వెనకడుగు వేస్తనో అని భయపడి పోలేదు. నేను హైదరాబాద్‌ల రైలెక్కేసరికి ఏమీ అర్ధం కాలేదు. నా ప్రాంతాన్ని వదిలిపోతున్నా. నేను ఎన్నో కలలు కన్న తెలంగాణను వీడిపోతున్నా. ఇదొక్కటే చాలా బాధ కలిగింది. అయినా సరే.. తెలంగాణ విముక్తి కోసం ఉద్యమంలో ఒక బిందువునవుత. ప్రధానమంత్రి గారూ నా శవాన్ని ఒక్కసారి చూడండి. జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులారా.. దయచేసి నా చావుగురించి రాయండి. ఓ కెమెరామెన్‌ మిత్రులారా..ఒక్కసారి నా తెలంగాణవైపు మీ కెమెరాల్ని తిప్పండి!

Friday, 22 July 2011

ఢిల్లీ ఆంధ్రా ఉద్యోగి రెండు చెంపలు వాయించిన హరీశ్‌రావు

మరోసారి ఏపీ భవన్ వార్తల్లోకి ఎక్కింది. హస్తినలో పార్లమెంటు సమీపాన మరణమృదంగం మోగించిన యాదిడ్డి మృతదేహానికి ఏపీ భవన్‌లో ఎందుకు అవమానం జరిగింది? ఎందుకంటే అది ఆంధ్రవూపదేశ్ భవన్ కాదు.. ఆంధ్రోళ్ల భవన్ కాబట్టి! నిజమే! అది ఆంధ్రవూపదేశ్ భవన్ కాదు.. అచ్చంగా ఆంధ్రోళ్ల భవన్! అక్కడ పని చేసేది ఆంధ్రవూపదేశ్ ఉద్యోగులు కాదు.. ఆంధ్ర ఉద్యోగులే! అక్కడ పని చేస్తున్న వారిలో ఆంధ్రా ప్రాంత ఉద్యోగులు 46 మంది ఉంటే.. తెలంగాణ ప్రాంత ఉద్యోగులు కేవలం ఇద్దరే! జూన్ 17వ తేదీ సంచికలో ఈ వాస్తవాన్ని నమస్తే తెలంగాణ బయటపెట్టింది. ఏపీ భవన్ కాదు.. ఆంధ్రోళ్ల భవన్ అంటూ కథనాన్ని ప్రచురించింది. తెలంగాణవాదులు విమర్శిస్తున్నట్లుగా.. అక్కడ పని చేసేవాళ్లలో 42 శాతం తెలంగాణవాళ్లు ఉద్యోగులుగా ఉండి ఉంటే.. నిస్సందేహంగా ఓ అమరవీరుడి భౌతికకాయం అవమానాన్ని ఎదుర్కొని ఉండేది కాదు. ఈ నేపథ్యంలోనే ‘ఆంవూధాభవన్’లో ఉద్యోగుల లెక్కల బాగోతాన్ని పునర్మువూదిస్తున్నాం.


(అది దేశ రాజధాని ఢిల్లీలోని ఆంధ్రవూపదేశ్ భవన్! హస్తినలో మన రాష్ట్ర ప్రభుత్వ అధికార కేంద్రం! ఢిల్లీలో రాష్ట్త్ర ప్రభుత్వ కార్యకలాపాలన్నింటికీ ఈ భవనే కేంద్ర బిందువు. మన రాష్ట్ర ప్రతినిధులకు అపాయింట్‌మెంట్ ఇప్పించే దగ్గర నుండి పెండింగ్ పనులను ఫాలోఅప్ చేసేంత వరకు.. విషయమేదైనా ఈ భవనే కీలకం! సుప్రీం కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించే న్యాయవాదులను సమన్వయ పరిచే బాధ్యతను సైతం ఈ భవనే మోస్తుంది. మన రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర మంత్రు లు, ఎమ్యెల్యేలు, ఉన్నతాధికారులు ఢిల్లీ కొచ్చినప్పుడు ఇక్కడనే బస చేస్తారు.

కీలక అంశాల్లో కేంద్ర ప్రభుత్వంతో జరిపే చర్చలపై రాష్ట్ర ఉన్నతాధికారుల సమీక్ష సమావేశాలు సైతం ఈ భవన్లోనే జరుగుతాయి. దీని నిర్వహణకు రాష్ట్ర బడ్జెట్‌లో దాదాపు ఆరు కోట్లు కేటాయిస్తారు. ఇన్ని విశిష్ఠతలకు నెలవైన ఏపీభవన్‌ను.. మినీ సచివాలయంగా పరిగణిస్తారు. అలాంటి మినీ సచివాలయంలో తెలంగాణ ప్రాంతానికి ఎంత ప్రాతినిథ్యం ఉంది? సమాచార హక్కు చట్టం కింద.. ప్రాంతాలవారీగా ఉన్న ఉద్యోగస్తుల వివరాలను ‘నమస్తే తెలంగాణ’ సేకరిస్తే.. విస్మయం కల్గించే వాస్తవాలు బయపడ్డాయి. తెలంగాణకు హస్తినలో జరుగుతన్న మోసాన్ని కళ్లకు కట్టాయి. ఏపీభవన్‌లో ఉద్యోగం పొందిన తెలంగాణ ప్రాంత ఉద్యోగులు.. కేవలం ఇద్దరు!! ఏపీ భవన్‌లో ప్రస్తుతం దాదాపు 122 మంది రెగ్యులర్ ఉద్యోగస్తులు పని చేస్తున్నారు. మరో 50 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు.

భవనం ఢిల్లీలో ఉన్న దృష్ట్యా నిబంధనలకు లోబడి సుమారు 16% ఉద్యోగాలను ఆ ప్రాంతం వారికి కేటాయించాలి. కానీ రెగ్యులర్ ఉద్యోగస్తుల్లో వారి వాటా ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ వారు రూమ్ బాయ్, ఆఫీస్ బాయ్, మాలి, చౌకీదార్, స్వీపర్, డ్రైవర్ లాంటి నాల్గవ తరగతిఉద్యోగాలకే పరిమితమయ్యారు. మిగిలిన 59 ఉద్యోగాల్లో ఆంధ్రా ప్రాంతం వారు 46 ఉద్యోగాలు దక్కించుకుంటే తెలంగాణకు దక్కినవి కేవలం రెండే. అంటే దేశ రాజధానిలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో తెలంగాణవారు ఇద్దరేనన్నమాట! శాతంలో చూస్తే.. మొత్తం ఉద్యోగాల్లో ఆంధ్రా ప్రాంతం వారు 78 శాతమైతే తెలంగాణ ఉద్యోగులు కేవలం 3 శాతం. ఇక మిగిలిన 11 మంది ఉద్యోగులు హైదరాబాదు ప్రాంతం వారని పేర్కొన్నప్పటికీ.. దాదాపుగా వారంతా తెలంగాణేతరులే. ఇక 50 మంది కాంట్రాక్టు ఉద్యోగుల్లో తెలంగాణ వారు కనీసం ఒక్కరు కూడా లేరు. ఇదీ ఆంధవూపదేశ్ భవన్ సాక్షిగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయం.

జీవో 610 అమలు తీరును కోరుతూ సమాచారం అందించాలని అడిగితే ఉద్యోగుల ఎంపిక రాష్ట్ర రాజధానిలో జరిగినందున స్థానిక నిబంధనలు, జీవో 610 తమ శాఖల్లో వర్తించవని కొన్ని శాఖలు పేర్కొన్నాయి. అంటే జీవో 610 అమలు జరపకుండా ఎంపిక చేస్తే మనకు దక్కేవి బొటాబొటీ ఉద్యోగాలే.
కానీ జీవో 610 వర్తించని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో భిన్న ప్రాంత ప్రజలకు సమాన అవకాశాలను, సదుపాయాలను కల్పించే విధంగా సమ న్యాయ సూత్రాన్ని పాటించాలని రాజ్యంగ నిబంధన 371-డీ (1) పేర్కొంటోంది. ఈ నిబంధన కేవలం మన రాష్ట్రాన్ని ఉద్ధేశించే రాజ్యంగంలో పొందుపరిచారు. ఈ సమ న్యాయ సూత్రం ప్రకారం మొత్తం ఉద్యోగాలలో తెలంగాణకు దాదాపు 40% దక్కాలి.

కానీ ఆంధ్రవూపదేశ్ భవన్‌లో తెలంగాణకు దక్కినవి 3 శాతం ఉద్యోగాలు మాత్రమే. సమ న్యాయ సూత్రాన్ని యథేచ్ఛగా విస్మరిస్తున్నారనడానికి, రాష్ట్ర రాజధాని పేర.. ఉద్యోగుల్లో ఆంధ్ర ప్రాంతీయులను ఎంపిక చేస్తున్నారనడానికి ఏపీభవన్ నియామకాలే నిదర్శనంగా కనిపిస్తున్నాయ. ప్రభుత్వంలో అత్యంత కీలకమైన అధికార యంత్రాంగంలో తెలంగాణ వారికి ఏ మాత్రం భాగస్వామ్యం లేదని ఈ నియామకాలు వెల్లడిస్తున్నాయి.

ముందు వీళ్ల మీద చర్యతీసుకోండి

ముందు వీళ్ల మీద చర్యతీసుకోండి. తర్వాత హరీశ్‌రావు మీద తీసుకోండి
(తెలంగాణ శ్రీనివాస్‌)

ఎపీ భవన్‌ అధికారులపై దాడులు జరగడం ఇదేం కొత్త కాదు.. సీమాంధ్ర, తెలంగాణద్రోహులు ఏపీ భవన్‌ అధికారులను ఇదివరకు పిచ్చకొట్టుడు కొట్టిన్రు. అప్పుడు ఏ దళిత నేత కేసు పెట్టలేదు. చర్యతీసుకోవాలని అరవలేదు. అమరుడిని అవమానించిన చందర్‌రావును కొడితే కేసులు పెట్టేలని సీమాంధ్ర మీడియా. సీమాంధ్ర నేతలు బట్టలు చింపుకుంటున్నరు. ఎప్పుడు ఎవరు ఎవరిని కొట్టిన్రో చూడండి.

1)1986లో బీసీ వర్గానికి చెందిన ఆనంద రాఘవన్‌ అనే బీసీ అధికారిపై ఎంపీ కావూరి సాంబశివరావు చేయిచేసుకున్నడు.

2)1986లోనే అదే ఆనందరాఘవపై వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దాడి చేసి చెంప పగలగొట్టిండు.

3)1987లో ఎంపీ కే.యం.ఖాన్‌ నాగేశ్వరావ్‌ అనే ఎంప్లాయిపై చెయి చేసుకున్నడు.

4)1988లో అదే నాగేశ్వర్‌రావుపై కాంగ్రెస్‌ నేత మహ్మద్‌ జానీ దాడి చేసిండు.

5)1991లో బాలరాజ్‌ అనే కాంగ్రెస్‌ నాయకుడు మల్లిఖార్జున్‌పై చెయ్యి చేసుకున్నడు.

6)1996లో గఫర్‌ అనే అధికారిపై దానం నాగేందర్‌ రెచ్చిపొయి చితకబాదిండు.

7)దానం దాడికి నిరసనగా ఏపీ భవన్‌ ఉద్యోగుల ఆందోళన చేస్తే.. ప్రభుత్వం వారిపై ఎస్మా ప్రయోగించింది.

8)2010లో ఎస్టీ వర్గానికి చెందిన అసిస్టెంట్‌ కమిషనర్‌ లింగరాజును ఢిల్లీ ఎయిర్‌ పోర్టులో మహ్మద్‌ జానీ చెప్పుతో కొట్టిండు.

వీళ్లు మనుషులు కాదా? వీళ్ల మీద చర్యతీసుకోరా, వీళ్లపై చర్య తీసుకున్నంకనే మావోళ్ల మీద చర్యతీసుకోవాలి. అయినా కొట్టింది హరీశ్‌ అయితే వినోద్‌, కేటీఆర్‌లపై ఎందుకు కేసుపెట్టించిన్రు. ఈ కేసుల కుట్రలో సీమాంధ్ర నేతలతో పాటు సీమాంధ్రమీడియా హస్తం కూడా ఉంది.

Saturday, 9 July 2011

Jagan stand on telangana

mr ys. jaganmohanreddy who convinor of the ysr congress party. is cleared his stand on telangana at pleanary.

Tuesday, 5 July 2011

తోలు మందం హై కమాండ్ ....

ప్రత్యేక తెలంగాణా కోసం నేతలంతా మూకుమ్మడిగా  రాజీనామా చేసినా కాంగ్రెస్ పార్టీ హై కమాండ్ కు కనీసం చీమ కుట్టినట్లైనా లేదంటే తెలంగాణా ప్రాంతం పట్ల ఆ పార్టీ కి ఉన్న చిత్త శుద్ధికి నిదర్శనం. పుండు మీద కారం చల్లినట్లుగా వంకర టింకర వ్యాఖ్య లు చేయటాన్ని ఏమనాలి?. ఇంకెన్నాళ్ళు జనం తన్నుకు చావాలి ? కాంగ్రెస్ ను బంగాల ఖాతంలో  కలిపితే  తప్ప దాని రోగం కుదరదు .