అధిష్టా నం ఆదేశాలను భే ఖాతరు చేసిన టి-ఎంపి లు
న్యూఢిల్లీ: తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు పార్టీ అధిష్టానం విప్‌ను ధిక్కరించి ఓటింగుకు గైర్హాజరయ్యారు. పార్లమెంటులో లోక్ పాల్, ధరల పెరుగుదలపై గురువారం ఓటింగు జరిగింది. దీనికి హాజరు కావాలని తెలంగాణ కాంగ్రెసు ఎంపీలకు పార్టీ అధిష్టానం విప్ జారీ చేసింది. విప్ ధిక్కరించి వారు ఓటింగుకు గైర్హాజరయ్యారు. ఎంపీ సురేష్ షేట్కార్ మినహా ఎవరూ సభకు హాజరు కాలేదు. ఆయన ధరల పెరుగుదలపై ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. కాగా పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో రాజ్యసభ సభ్యుడు కె కేశవరావు ఇంట్లో టి-కాంగ్రెసు ఎంపీలు సమావేశమయ్యారు.
అనంతరం గుత్తా సుఖేందర్ రెడ్డి, మధుయాష్కీ మాట్లాడారు. రాజీనామాలపై తాము రాజీ పడే ప్రసక్తి లేదని చెప్పారు. శనివారం రోజు హైదరాబాదులో కాంగ్రెసు స్టీరింగ్ కమిటీ సమావేశం అయి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ కోసం ప్రజా సంఘాలు చేస్తున్న ఆందోళనలకు మద్దతు ఇస్తామని చెప్పారు. అయితే ఉద్యోగ సంఘాలు చేస్తున్న దీక్షకు తాము మద్దతు ప్రకటించేది లేనిది స్టీరింగ్ కమిటీలో నిర్ణయిస్తామని చెప్పారు.
ఓటింగు అనంతరం షేట్కారు విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వానికి ఇబ్బందులు కలగకూడదనే ఓటింగులో పాల్గొన్నట్టు చెప్పారు. ధరల పెరుగుదల విషయంలో ఓటింగులో పాల్గొన్నట్లు చెప్పారు. అయితే తెలంగాణ కోసం ఉద్యమం కొనసాగుతుందన్నారు. ఓటింగుకు తెలంగాణ ప్రజాప్రతినిధులు అందరూ రావాలని అనుకున్నప్పటికీ ఓటింగ్ ముందుగా జరగడం వల్ల వారు రాలేక పోయారని చెప్పారు. ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నది సమావేశాలు బహిష్కరించడానికి కాదన్నారు. కాగా లోక్ పాల్ బిల్లును మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ప్రవేశ పెట్టారు. అయితే ప్రధాని, న్యాయవ్యవస్థను లోక్ పాల్ పరిధిలోకి తీసుకు రాకపోవడంపై విపక్షాలు ప్రశ్నించాయి.

1 comments:
antha drama guru
Post a Comment